ప‌్రమాదకర కరోనా వైరస్‌పై పోరాటంలో క్రీడాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అందరు ఇండ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మ అన్నాడు. ట్విట్టర్ ద్వారా అందరికి సందేశమిచ్చాడు. ‘కొవిడ్-19 వైరస్ బారిన పడకుండా అందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండండి. టీ20 ప్రపంచకప్ మొదలయ్యేందుకు ఇంకా చాలా సమయముంది ’ అని రోహిత్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానున్న సంగతి తెలిసిందే.
ఇంట్లోనే ఉండండి..ప్రపంచకప్ టోర్నీకి ఇంకా సమయముంది: రోహిత్‌శర్మ