'తోటబావి' టీజర్‌ విడుదల

బుల్లితెర వ్యాఖ్యాత రవి హీరోగా మారిన విషయం తెలిసిందే. రవి హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘తోటబావి’. గౌతమి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి దేవండ్ల దర్శకుడు. అలూర్‌ ప్రకాష్‌గౌడ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఇటీవల విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు విజన్‌ ఈ చిత్రంలో కనిపిస్తుంది. రవికి హీరోగా ఈ చిత్రం మంచి పేరును తీసుకొస్తుందనే నమ్మకం వుంది’అన్నారు. 


యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం వుందని దర్శక,నిర్మాతలు తెలిపారు.  నా సినిమా టీజర్‌ను డైరెక్టర్‌  శంకర్ విడుదల చేయడం హ్యాపీగా ఉందని ద‌ర్శకుడు అంజి దేవండ్ల అన్నారు.  శివశంకర్‌ మాస్టర్‌, ఛత్రపతి శేఖర్‌, నర్సింహా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: దౌలు, చిన్నస్వామి, అభినేష్‌.