ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ అన్నారు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న ఆప్ కన్వీనర్ అరవింద్‌కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ..మా అంచనాలను చేరుకోలేకపోయాం. ఫలితాలు అంచనాలకు తగినట్టుగా రాకపోవడంతో కొన్నిసార్లు నిరాశచెందాం. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కేజ్రీవాల్ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 2015 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని, కార్యకర్తలెవరూ మనస్తాపం చెందవద్దని కోరారు.
అంచనాలు చేరుకోలేకపోయాం: మనోజ్‌తివారీ