షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: 'నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..'
BBC
షాద్‌నగర్‌లో ఓ పశువైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిందితులను తక్షణమే శిక్షించాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు కూడా దిగారు.
మరోవైపు ఈ ఘటన గురించి స్పందిస్తూ తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం సాయంత్రం చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో హిందీలో మాట్లాడారు.